ఆ నాలుగు

మొదటి దశ,వెలుగు నీడలు...
వెలుగు లోకి వచ్చాను,
నీడలే చూసాను,
మెల్లగా నేను ఎవరు అని ఆలోచించాను !!

రెండవ దశ,అడుగు జాడలు...
అడుగులు వేసాను,
జాడలు కై పరుగులు తీసాను,
మెల్లగా నా ఆలోచనకి పదును పెట్టాను !!

మూడవ దశ,వెలుగుల జిలుగులు...
వెలుగుల కాంతిలో,
జిలుగులు భ్రాంతిలో నన్ను వెతికే ప్రయత్నం చేశాను,
మెల్లగా నా వ్యక్తిత్వం తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను !!

నాలుగవ దశ,వ్యక్తిత్వం అస్తిత్వం...
వ్యక్తిత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో,
నా అస్తిత్వానికి నాంది ఏంటి అని అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాను,
సరైన పరువది తో గమ్యానికి నడక ప్రారంభించాను !!

Comments