ఏది తప్పు, ఏది ఒప్పు?
మనసుకు అనిపించిందని,
కళ్ళకు కనిపించిందని,
లేదా ఇతరులకు అనిపించిందని,
తప్పు ఒప్పులు నిర్ణయిస్తామా??
కటోరంగా ఉంది అని,
నిష్ఠూరంగా ఉంది అని,
లేదా కష్టంగా ఉంది అని,
ఇది తప్పు అని నిర్ధారిస్తామా?
సమయానికి అనుకూలం గా ఉంది అని,
పర్యావరణం ప్రతికూలంగా ఉంది అని,
లేదా ప్రమాదం లేదు అని,
ఇది ఒప్పు అని తెలుసుకోగలమా?
సహాయం చేయాలని,
స్నేహం పొందాలని,
లేదా సర్దుకుపోవాలని,
తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తెలుసుకోలేమా?
తెలియక చేసాము అని,
తెలుసుకోవాలని చేసాము అని,
తెలియచేయడానికి చేసాము అని,
తప్పుని ఒప్పుగా మార్చేస్తామా?
ప్రశ్నకి జవాబు లేదు అని,
జవాబు కీ ఆధారం లేదు అని,
లేదా అస్తిత్వానికి ఆటంకం అని,
మన మనసాక్షిని మర్చిపోతామా?
ఈ తప్పు ఒప్పుల సంగర్షణలో ఇలా నలిగిపోతామా?
మనసుకు అనిపించిందని,
కళ్ళకు కనిపించిందని,
లేదా ఇతరులకు అనిపించిందని,
తప్పు ఒప్పులు నిర్ణయిస్తామా??
కటోరంగా ఉంది అని,
నిష్ఠూరంగా ఉంది అని,
లేదా కష్టంగా ఉంది అని,
ఇది తప్పు అని నిర్ధారిస్తామా?
సమయానికి అనుకూలం గా ఉంది అని,
పర్యావరణం ప్రతికూలంగా ఉంది అని,
లేదా ప్రమాదం లేదు అని,
ఇది ఒప్పు అని తెలుసుకోగలమా?
సహాయం చేయాలని,
స్నేహం పొందాలని,
లేదా సర్దుకుపోవాలని,
తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తెలుసుకోలేమా?
తెలియక చేసాము అని,
తెలుసుకోవాలని చేసాము అని,
తెలియచేయడానికి చేసాము అని,
తప్పుని ఒప్పుగా మార్చేస్తామా?
ప్రశ్నకి జవాబు లేదు అని,
జవాబు కీ ఆధారం లేదు అని,
లేదా అస్తిత్వానికి ఆటంకం అని,
మన మనసాక్షిని మర్చిపోతామా?
ఈ తప్పు ఒప్పుల సంగర్షణలో ఇలా నలిగిపోతామా?
Comments
Post a Comment