Samayam

Parugulu teese samayamki alasata ledu,
alasata leni e samayaniki gamyam teliyadu,
gamyam teliyani e paruguki ardham ledu,
ayina aa samayam akkaditho aagaledu !!

Urakalu vestoo neeku nene thodu antoo vastondi oka kshanam,
prati oka kshanam kalisi chesenu oka prayogam,
phalitam ga pratyakshamayenu oka nimisham,
ayina aa samayam akkaditho vodaledu !!

Gaalilo tele nimisham,srushitinchenu ganta
ganta marenu roju la,roju marenu yedaadi la,yedaadi marenu dasapdham la
pravahinche samayam marenu satapdham la,marenu taram taram nirantaram paare neeru la,
ayina aa samayam akkaditho trupthi chendaledu !!

Ennatiki aagani parugu idi,evvariki vinipinchani arupu idi
selavu ane padaniki chote leni vyavastha idi,manishi chese maarpulaku aagani prayaanam idi,
dabbu kante goppadi ani anukshanam niroopinche nijam idi,kaalame annitiki samaadhanam ani teliyachese shakthi idi !!

Samayam samayam samayam

Translation:

పరుగులు తీసే సమయంకి అలసట లేదు,
అలసట లేని ఈ సమయానికి గమ్యం తెలియదు,
గమ్యం తెలియని ఈ పరుగుకి అర్ధం లేదు,
అయిన ఆ సమయం అక్కడితో ఆగలేదు !!

ఉరకలు వేస్తూ నీకు నేనే తోడు అంటూ వస్తోంది ఒక క్షణం,
ప్రతి ఒక క్షణం కలిసి చేసెను ఒక ప్రయోగం,
ఫలితం గా ప్రత్యక్షమాయెను ఒక నిమిషం,
అయిన ఆ సమయం అక్కడితో వాడలేదు !!

గాలిలో తేలే నిమిషం సృష్టించెను గంట,
గంట మారెను రోజు లా,రోజు మారెను ఏడాది లా,ఏడాది మారెను దసప్ధం లా,
ప్రవహించే సమయం మారెను సతప్ధం లా,మారెను తరం తరం నిరంతరం పారే నీరు లా,
అయిన ఆ సమయం అక్కడితో తృప్తి చెందలేదు !!

ఎన్నటికి ఆగని పరుగు ఇది,ఎవ్వరికి వినిపించని అరుపు ఇది,
సెలవు అనే పదానికి చోటే లేని వ్యవస్థ ఇది,మనిషి చేసే మార్పులకు ఆగని ప్రయాణం ఇది,
డబ్బు కంటే గొప్పది అని అనుక్షణం నిరూపించే నిజం ఇది,కాలమే అన్నిటికి సమాధానం అని తెలియచేసే శక్తి ఇది !!

సమయం సమయం సమయం

Comments