వేసే ప్రతి అడుగు వెయ్యాలి రేపటి వైపు,
చేసే ప్రతి ఆలోచన అవ్వాలి రేపటి గెలుపు,
ఉండాలి ప్రతి క్షణం ముందు చూపు !
చూసే చూపు లో రావాలి మార్పు,
చెప్పే మాట లో తెలియాలి నీ ఓర్పు,
మన నమ్మకమే మనకి ఓదార్పు !
ఇక్కడ ఆశలకు లేదు కరువు,
వెయ్యకు నీ మనసు మీద బరువు,
కోరికలు మిగిల్చేవి కన్నీటి చెరువు !
చూడు అందరిలో మంచితనం ఎల్లప్పుడూ,
చేయి అందరికి మంచి ఎల్లప్పుడూ,
చేసిన మంచి నిలుస్తుంది ఎల్లప్పుడూ !
నేటి నిజం రేపటి గతం ఇది సహజం ...
Comments
Post a Comment