ఎవరు నీవు

ఎవరు నువ్వు, ఎవరు నువ్వు
బంధమా అనుబంధమా ?
నాలో ఉన్నా నువ్వు, నాతో ఉన్నా నువ్వు
బంధమా అనుబంధమా ?

ధ్వేషిస్తే దూరం అవుతావు
ప్రేమిస్తే చెరువు అవుతావు
ఎవరు నువ్వు, ఎవరు నువ్వు
ప్రళయమా ? వినయమా?

అవకాశం ఇస్తే అందుకుంటావు
ఆవేదన ఇస్తే అంగీకరిస్తావు
ఎవరు నువ్వు, ఎవరు నువ్వు
వివేకమా? విధేయమా?

కనీరు ఇస్తే ఓదారుస్తావు
చిరునవ్వు ఇస్తే పొంగిపోతావు
ఎవరు నువ్వు, ఎవరు నువ్వు
ఓటమా? గెలుపా?

గుర్తుతెచ్చుకుని విలపిస్తావు
గుర్తులేదు అని చింతిస్తావు
ఎవరు నువ్వు, ఎవరు నువ్వు
ఆలోచనా? అవివేకమా?

ఎవరు నువ్వు, ఎవరు నువ్వు
బంధమా అనుబంధమా ?
నాలో ఉన్నా నువ్వు, నాతో ఉన్నా నువ్వు
బంధమా అనుబంధమా ?

Comments