నాటకం

రాకా పోకలన నడుమ ఈ నాటకం,
ఇదీ ఆ పైవాడు రాసినా జగన్నాటకం !!

నిరంతరం పాత్రకు న్యాయం చేకూర్చె తపన,
నిత్యం నీతో నీకే ఎదో ఒక సంఘర్షణ,
అది నిజమో లేక కల్పితమో తెలుసుకోలేని ఆవేదన,
ఇది కదా ఆ పైవాడి చిత్రీకరణ !!

ప్రతి ఘట్టంలో ఎదో ఒక మలుపు,
ప్రతి నిమిషం నీతో నీకే నిట్టూర్పు,
ఆది సహజమో లేక సన్నివేశమో తెలుసుకోలేని ఓదార్పు,
ఇది కదా ఆ పైవాడి గెలుపు !!

వచ్చే తరానికి ఎదో ఆదర్శంగా నిలవాలి అనే భావన తో,
కలిసేవారుఅందరితో కనిపించని పోటి తో,
ఆది సందర్భమో లేక ఆవివేకమో తెలుసుకోలేని ఆమాయకత్వం తో,
ఇది కదా చేసాడు ఆ పైవాడు చాకచక్యం తో !!

మనది సదుద్దేశం అని మనకి తెలిసిన,
పరులకు అది ఎలా అనిపించేనో మనకి ఎలా తెలిసేనా,
ఈ స్వయంకృషి నా చివరి శ్వాస కైనా ఆగేనా,
ఇది కదా ఆ పైవాడి మనతో చేయించే నటన !!

రక పోకల నడుమ ఈ నాటకం,
ఇది ఆ పైవాడు రాసిన జగన్నాటకం !!
***********************************

NAATAKAM

Raka pokala naduma e naatakam,
Idi aa pivaadu raisna jagannatakam !!

Nirantaram paatraku nyaayam chekurche tapana,
nityam neeto neeke edo oka sangarshana,
adi nijamo leka kalpitamo telusukoleni aavedana,
idi kada aa pivaadi chitreekarana !!

Prati gattam lo edo oka malupu,
prati nimisham neeto neeke nittoorpu,
adi sahajamo leka sannivesamo telusukoleni oodaarpu,
idi kada aa pivaadi gelupu !!

Vacche taraniki edo aadarsam ga nilavali ane bhaavam tho,
Kalisevaaruandaritho kanipinchani poti tho,
adi sandarbhamo leka avivekamo telusukoleni aamayakatvam tho,
idi kada cheasdu aa pivaadu chatichakyam tho !!

Manadi saduddesam ani manaki telisina,
paraulaku adi ela anipincheno manaki ela telesena,
ee swayamkrushi naa chivari swaasa kaina aagena,
idi kada aa pivaadi manatho cheyinche natana !!

Raka pokala naduma e naatakam,
Idi aa pivaadu rasina jagannatakam !!

Comments